కర్నూలు జీజీహెచ్‌లో ఏపీఎంఎస్‌ఐడీసీ) ఎండీ ఐఏఎస్ పర్యటన
1 min readఅడిషనల్ DME & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఎండీ డి.మురళీధర్‌రెడ్డి కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, విభాగాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు.స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ విభాగములో సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, పాలేటివ్ కేర్, ప్లాస్టిక్ సర్జరీ విభాగము మరియు KMC లోని ఎగ్జామ్ హాల్ విభాగాలను సందర్శించినట్లు తెలిపారు.స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి అత్యాధునిక పరికరాలు అందుబాటులో రానున్నట్టు తెలియజేశారు.ఆసుపత్రిలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈ నెలాఖరులో ప్రారంభించనున్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, సర్జికల్ ఆంకాలజీ హెచ్ఓడి, డా.ప్రకాష్, RMO డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్లు, SE, శ్రీ.రమేష్ రెడ్డి, ఈఈ, శ్రీ.శివకుమార్, తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ DME & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, తెలిపారు.