పండ్ల మొక్కలను పంపిణీ చేసిన ఏపీఓ జయంతి
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: వివిధ గ్రామాలకు చెందిన రైతులకు చెట్ల మొక్కలను ఏపీఓ భూపన జయంతి పంపిణీ చేశారు.సోమవారం మధ్యాహ్నం ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న పొలంలో తొమ్మిది గ్రామాల రైతులకు వివిధ రకాల పండ్ల మొక్కలు టెంకాయ చెట్లు-1564,నేరెడు-501, మామిడి-807,నిమ్మ-660,జామ-528,దానిమ్మ-201 పండ్ల మొక్కలను రైతులకు ఆమె అందజేశారు.ఇప్పటివరకు వివిధ గ్రామాలలో రైతుల పొలాలలో పండ్ల మొక్కలను నాటుటకు రైతుల అంగీకారం మేరకు వారి పొలాల్లో మొక్కలు నాటుటకు గుంతలో తీయడం జరిగిందని మొత్తం తొమ్మిది గ్రామాలకు కలిపి 4261 పండ్ల మొక్కలు మండలానికి వచ్చాయని ఈ మొక్కలను రైతులకు అందజేస్తున్నట్లు ఏపీవో తెలిపారు.అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి పండ్ల మొక్కలను వేసిన తర్వాత వాటిని ప్రతి ఒక్కరూ కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని ఎప్పుడు మీరు మొక్కలను సంరక్షించుకుంటే రాబోయే రోజుల్లో మీ జీవిత అభివృద్ధికి పండ్ల చెట్లు తోడ్పడతాయని ఏపీ విజయశాంతి రైతులకు తెలియజేశారు.ఈకార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ రాములమ్మ మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు మర్రి రామేశ్వరుడు,నాగరాజు, మునీశ్వరుడు,ఆలిం భాష,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.