ఏపీఎస్ఆర్టీసీ ఎండి మొండివైఖరికి వ్యతిరేకంగా ఎమ్మార్వో కి వినతి
1 min read
ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్
ఎమ్మిగనూరు డిపో
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: న్యూస్ ఎమ్మిగనూరు పట్టణంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు05/05/25 తేదిన నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సోమవారం నాడు ఎమ్మిగనూరు డిపోలో రీజనల్ సహాయ కార్యదర్శి ఎన్ .పి .ఎం. సాహెబ్ అధ్యక్షతన డిపో అధ్యక్ష, కార్యదర్శులు, ఎస్ . ఎం . రఫీక్,ముస్తాక్ అహ్మద్ గ్యారేజీ కార్యదర్శి కె.వి భాస్కర్ ల ఆధ్వర్యంలో మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకునేటందుకుఎమ్మిగనూరు తహసిల్దార్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేయడం జరిగింది.. ఈ సందర్భంగా రీజనల్ సహాయ కార్యదర్శి ఎన్.పి.ఎం.సాహెబ్ ఎం.ఆర్.ఓ. తో మాట్లాడుతూ క్రింది సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ ప్రసంగిస్తూ క్రింద పేర్కొన్న ప్రధాన డిమాండ్లను ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు ఎండి చొరవ తీసుకొని పరిష్కరించకపోతే రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చిన సమ్మె కైనా సిద్ధమని హెచ్చరించారు.
ప్రధాన డిమాండ్లు:1/2019 భద్రతా సర్క్యులర్ ను అమలు చేయాలి . ఉద్యోగులకు డబుల్ డ్యూటీ అమౌంట్ పెంచాలి.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థ ద్వారా వేతనాలు పెంచాలిజఉద్యోగులపై విధించే అక్రమ సస్పెన్స్,రిమూవల్స్ ఆపాలి. పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలి. 4 సంవత్సరాలుగా ఆగిపోయిన అన్నీ క్యాటగిరీల్లో ప్రమోషన్లు ఇవ్వాలి.మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులు ఇవ్వాలి.నాన్. ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి.ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీవితం ఇవ్వాలి.ఈ హెచ్ ఎస్. స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్దరించాలి.ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ./ప్రభుత్వం ద్వారా కొనాలి. ఆర్టీసీ. లో ఉన్న విధంగానే క్యాడర్ స్ట్రంత్ ను అమలు చేయాలి.రిటైర్డు ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణాలను అనుమతించాలి.ఆఫీసు సిబ్బంది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి.ఉద్యోగులకు అవసరాన్ని బట్టి ఈఓఎల్ మంజూరు చేయాలి. డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ వివరించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చేస్తున్నామని రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చినా కూడా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో పాటు ప్రతి సభ్యుడు ఇదే విధంగా ఉత్సాహంతో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిపో సంయుక్త కార్యదర్శి ఎం.ఎల్.రెడ్డీ,డిపో ప్రచార కార్యదర్శులు బజారప్ప, సహాయ కోశాధికారి కె. తిమ్మప్ప, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్. డి. గిరి, జి. నాగరాజు, పి. కె.వలి, యు నూ స్ , కె. బి.రాముడు, ఎస్.వి.భాషా, బి.వెంకన్న,నాగలాపురం వీరన్న,తదితరులు పాల్గొన్నారు.