NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా రిసోర్స్ పర్సన్ పోస్టు నకు దరఖాస్తులు ఆహ్వానం..

1 min read

– ఫుడ్ ప్రాసెసింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత..

– జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ రామ్మోహన్

పల్లెవెలుగు వెబ్‌ ఏలూరు జిల్లా : ఏపి ఫుడ్ ప్రోసెస్సింగ్ సొసైటీ (APFPS) పరిధిలో జిల్లా రిసోర్స్ పర్సన్ (DRP) గా ఇన్సెంటివ్ పద్ధతిలో పనిచేయడానికి ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఏలూరు  జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  యస్.రామ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫుడ్ ప్రోసెస్సింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని, అలాగే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎం.బి.ఎ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. పై డిగ్రీ తో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎల్.ఐ.సి., మార్కెటింగ్, స్వచ్చంద సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామని తెలియచేసారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ మేరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహ ఆహార పరిశ్రమల ఏర్పాటు కొరకు ఔత్సహికులకు అవగాహన కల్పించడం, బ్యాంకు లింకేజి చేయించడం మరియు వారి ఆహార పరిశ్రమల స్థాపనకు జిల్లా రిసోర్స్ పర్సన్ పనిచేయాల్సి వుంటుంది. జిల్లా రిసోర్స్ పర్సన్ కు  వేతనం ప్రోత్సాహక ప్రాతిపదికన మాత్రమే ప్రయోజనం కల్పించబడుతుందన్నారు.  అభ్యర్ధులు తమ బయోడేటాతో దరఖాస్తులను  పోస్టు ద్వారా Executive Director, APFPS, ఉద్యాన శాఖ కార్యాలయము, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎదురుగా, నరసింహారావు పేట, ఏలూరు – 534006, ఏలూరు జిల్లా చిరునామాకు  గాని లేదా [email protected] కు ఈ మెయిలు ద్వారా గాని ఈనెల 25వ తేదీ లోగా పంపాలని ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు  ఆఫీసు నందు గాని లేదా   9985903417 నెంబర్ కు గాని సంప్రతించవచ్చన్నారు.

About Author