PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోడల్ పాఠశాల 6వ తరగతికి దరఖాస్తులు

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న ఏపీ మోడల్ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరవ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్ సలీం భాష సోమవారం తెలిపారు.6వ తరగతిలో 100 సీట్లు ఉన్నాయని.ఈనెల 31వ తేదీ చివరి తేదీ అని ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని  21.04.2024 ఉ.10 గంటల నుంచి మ.12 గంటల వరకు స్థానిక మోడల్ పాఠశాల ఐదవ తరగతి స్థాయి సిలబస్ తెలుగు,ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ అన్నారు.ప్రవేశ పరీక్ష కోసం ఓసి,బీసీ విద్యార్థులు రూ.150, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు రూ.75 రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

About Author