స్వయం ఉపాధి పధకాలకు దరఖాస్తుల ఆహ్వానం
1 min read
దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది మార్చి,22
జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : వెనుకబడిన తరగతుల కోసం అమలు చేస్తున్న స్వయం ఉపాధి పధకాలకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. 2024-25 సంవత్సరములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుక బడిన తరగతులు బిసిఎస్ (BCS) అనగా బిసి-ఎ, బిసి-బి, బిసి-ఐ అండ్ బిసి-ఇ (BC-A, BC-B, BC-I & BC-E) వర్గాల వారికి స్వయం ఉపాధి మరియు జనరిక్ ఫార్మసీ (బి- ఫార్మసీ/డి- ఫార్మసీ చదువుకున్న నిరుద్యో యువతీయువకులకు) మరియు మేదర/ కుమ్మరి శాలివాహన వాహన వారికి వృత్తి పరముగా బుట్టల అల్లకము/కుండల తయారు చేసుకుంటున్న వారి నిమిత్తము పధకముల క్రింద నిర్దేశించిన లక్ష్యముల మేరకు బ్యాంకులోను మరియు ప్రభుత్వ సబ్సిడీ తో ఆర్థిక సహాయము మంజూరు చేయుటకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థికముగా వెనుకబడిన తరగతులు ఇడబ్ల్యూఎస్ (EWS) వర్గాల వారు అనగా ఆర్యవైశ్య, రెడ్డి, మరియ, కమ్మ, బ్రాహ్మిణ్ మరియు ఇబిసి సామాజిక వర్గముల వారికి జిల్లా బిసి కార్పొరేషన్ ద్వారా వివిధ పధకములు అనగా స్వయం ఉపాధి మరియు జనరిక్ ఫార్మశి (బి-ఫార్మిశి/ది- ఫార్మశీ చదువుకున్న నిరుద్యోగ యువతీయువకులకు) పథకముల క్రింద నిర్దేశించిన లక్ష్యముల మేరకు బ్యాంకులోను మరియు ప్రభుత్వ సబ్సిడి తో ఆర్థిక సహాయము మంజూరు చేయబడతాయన్నారు. కాపు సామాజిక వర్గము వారికి అనగా కాపు, తెలగ బలిజ, ఒంటరి సామాజిక వర్గముల వారికి స్వయం ఉపాధి మరియు గ్రూపు ఎంఎస్ఎంఇ క్రింద లక్ష్యముల మేరకు బ్యాంకులోను మరియు ప్రభుత్వ సబ్బిడితో ఆర్థిక సహాయము మంజూరు చేయబడతాయన్నారు. దారిద్య్రరేఖకు దిగువనున్న (బిపిఎల్) అభ్యర్థులు https://apobmms.apcfss.in ద్వారా online లో దరఖాస్తు చేసుకొనుటకు ది. 10.03.2025 నుండి 22.03.2025 వరకు అవకాశము కల్పించబడిందన్నారు. పై అర్హతలున్న లబ్దిదారులు నేరుగా వారి వారి రైస్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్టు సైజు ఫొటో, మెబైల్, ఫోనుతో మీ సేవా/గ్రామ సచివాలయము ద్వారా తీసుకోబడిన కుల ధృవపత్రము, విద్యార్హతలు, పథకము మంజూరుకు కావలసిన అనుభవం వగైరా సర్టిఫికెట్లతో దగ్గరలో ఉన్న నెట్ సెంటరు/ మీ సేవా గ్రామ సచివాలయములో https://apobmms.apcfss.in ద్వారా ఈనెల 22వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.