స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానం
1 min read
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : వెనుకబడిన తరగతులకు చెందిన బిసి-ఎ, బిసి-బి, బిసి- డి, బిసి-ఇ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ ఫార్మసీలు, ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటుకు సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువనున్న అర్హులైన లబ్ధిదారులు https://apobmms.apcfss.in ద్వారా ఆన్లైన్లో మార్చి 22వ తేదీ లోపుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బిసి-ఎ, బిసి-బి, బిసి-డి, బిసి-ఇ & ఇడబ్ల్యూఎస్ వర్గాలు ఆర్యవైశ్య, రెడ్డి, కమ్మ, బ్రామ్మిన్, ఇడబ్ల్యూఎస్ వర్గాల వారికి కూడా స్వయం ఉపాధి, జనరిక్ ఫార్మశీల కొరకు బి-ఫార్మశీల లేక డి-ఫార్మశీ చదువుకున్న నిరుద్యోగ యువతీయువకులకు, స్వయం ఉపాధి పథకాలను మేదర, కుమ్మరి శాలివాహన వారికి వృత్తి పరముగా బుట్టల అల్లకము, కుండల తయారీ చేసుకుంటున్న వారి నిమిత్తము పధకముల క్రింద నిర్దేశించిన లక్ష్యముల మేరకు బ్యాంకులోను మరియు ప్రభుత్వ సబ్సిడీతో ఆర్థిక సహాయము మంజూరు చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.స్వయం ఉపాధి పథకము నందు ఆర్థిక సహాయము చేయుటకు 3 స్లాబులుగా విభజించడం జరిగిందన్నారు. యూనిట్ కాస్ట్ రూ.2.00 లక్షలు వరకు ఉన్న యూనిట్లకు 50% శాతము సబ్సిడీ లేదా రూ.75,000/- లు మించకుండా మరియు మిగిలిన సొమ్ము బ్యాంకు వారి ఋణముగా ఆర్ధిక సహాయము అందించబడును.యూనిట్ విలువ రూ.2.00 లక్షలు నుండి రు.3.00 లక్షలు వరకు ఉన్న యూనిట్లకు 50% శాతము సబ్బిడీ లేదా రు.1,25,000/-లు మించకుండా మరియు మిగిలిన సొమ్ము బ్యాంకు వారి ఋణముగా ఆర్ధిక సహాయము అందించబడును.యూనిట్ కాస్టు రు.3.00 లక్షలు నుండి రూ.5.00 లక్షలు వరకు ఉన్న యూనిట్లకు 50% శాతము సబ్సిడీ లేదా రూ.2,00,000/- లు మించకుండా మరియు మిగిలిన సొమ్ము బ్యాంకు వారి ఋణముగా ఆర్ధిక సహాయము అందించబడును అన్నారు.జనరిక్ ఫార్మశిలు మంజూరుకు యూనిట్ కాస్టు రు.8.00 లక్షలుకు గాను సబ్సిడీ రు.4.00 లక్షలు మరియు మిగిలిన సొమ్ము బ్యాంకు వారి ఋణముగా ఆర్థిక సహాయము అందించబడునని తెలియజేయడమైనదనీ తెలిపారు.వెనుకబడిన తరగతులకు చెందిన మేదర, కుమ్మరి శాలివాహన కులస్తులు 3 నుండి 5 గురు సభ్యులు గ్రూపుగా ఏర్పడి వృత్తిపరముగా బుట్టల అల్లకము, కుండల తయారీకి యూనిట్ కాస్టు రు.3.00 లక్షలుకు గాను సబ్సిడీ రు.1.50 లక్షలు, మిగిలిన సొమ్ము బ్యాంకు వారి ఋణముగా ఆర్థిక సహాయము అందించడం జరుగుతుందన్నారు.లబ్దిదారులు 21 సం.లు నుండి 60 సం.లు మధ్య వయస్సు కలిగి వారు రైస్ కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్, జనరిక్ ఫార్మసీ కొరకు బి ఫార్మసీ లేక డి ఫార్మసీ సర్టిఫికెట్ కలిగినవారు అర్హులని తెలిపారు. అర్హత కలిగిన లబ్దిదారులు నేరుగా వారి రైస్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్టు సైజు ఫొటో, మెబైల్ ఫోను, మీ-సేవా లేక గ్రామ సచివాలయము ద్వారా తీసుకోబడిన కుల ధృవపత్రము, విద్యార్హతలు, పథకము మంజూరుకు కావలసిన అనుభవం వగైరా సర్టిఫికెట్లతో దగ్గరలో ఉన్న నెట్ సెంటరు లేక మీ సేవా లేక గ్రామ సచివాలయములో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కాపు సామాజిక వర్గములోని కాపు, తెలగ బలిజ, ఒంటరి సామాజిక వర్గముల వారికి స్వయం ఉపాధి మరియు గ్రూవుగా ఎంఎస్ఎంఈ పధకముల క్రింద ఆర్థిక సహాయము చేయడం జరుగుతుందని, స్వయం ఉపాధి పధకము నందు ఆర్థిక సహాయము చేయుటకు సబ్సిడీని మూడు స్లాబులుగా విభజించడం జరిగిందన్నారు. యూనిట్ కాస్టు రూ.2.00 లక్షలు వరకు ఉన్న యూనిట్లకు 50% శాతము సబ్సిడి లేదా రూ.1,00,000/- లు మించకుండా మరియు మిగిలిన సొమ్ము బ్యాంకు వారి ఋణముగా ఆర్థిక సహాయము అందించబడును అన్నారు.యూనిట్ కాస్టు రూ.2.00 లక్షలు నుండి రూ.3.00 లక్షలు వరకు ఉన్న యూనిట్లకు 50% శాతము సబ్సిడీ లేదా రూ.1.50,000/- లు మించకుండా మరియు మిగిలిన సొమ్ము బ్యాంకు వాలె ఋణముగా ఆర్ధిక సహాయము అందించబడును.యూనిట్ కాస్టు రూ.3.00 లక్షలు నుండి రూ.5.00 లక్షలు వరకు ఉన్న యూనిట్లకు 50% శాతము సబ్సిడీ లేదా రూ.2.50,000/- లు మించకుండా మరియు మిగిలిన సొమ్ము బ్యాండు వారి ఋణముగా ఆర్ధిక సహాయము అందించబడును.ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, మధ్య ఎంటర్ప్రైజెస్) యూనిట్ల ఏర్పాటుకు మొత్తం రూ.25 లక్షలకు గాను రూ.10 బ్యాంకు లోను, రూ.10 లక్షలు సబ్సిడీ, లబ్దిదారుని కంట్రిబ్యూషన్ రు.5 లక్షలుగా ఉంటుందన్నారు. స్వయం ఉపాధి పధకము నందు ఆర్థిక సహాయము చేయుటకు లబ్దిదారులు 21 సం.లు నుండి 50 సం.లు మధ్య వయస్సు వారై ఉండాలన్నారు. రైస్ కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. ఎం.ఎస్.ఎం.ఇ పథకం నందు ఆర్థిక సహాయం చేయుటకు గ్రూపుగా 3 నుండి 5 మంది లబ్దిదారులు ఉండాలని, లబ్ధిదారుల వార్షిక ఆదాయము రు.8.00 లక్షలు లోపు ఉండాలన్నారు.