NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్వాడి హెల్పర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : మండలంలోని బయనపల్లె 5 వ అంగన్వాడి ఐ సి డి ఎస్ ప్రాజెక్టు లో ఖాళీగా ఉన్న అంగన్వాడి హెల్పర్ పోస్టుకు 31-08-2023 నుండి08-09-2023 తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఐ సి డి ఎస్ సిడిపిఓ రమాదేవి, తెలిపారు, ఈ సందర్భంగా ఆమె గురువారం చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని బయనపల్లె (కొండపేట) ఐదవ అంగన్వాడి కేంద్రానికి సంబంధించి బీసీ- బి – కేటగిరీలో హెల్పర్ గా పోస్టు ఖాళీగా ఉన్నదాని ఈ పోస్ట్ కు సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు, ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 03-05- 2023 తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తయి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు, దరఖాస్తుదారులు వివాహ మహిళగా స్థానిక రాలు అయ్యి ఉండాలన్నారు, అభ్యర్థులు తమ దరఖాస్తుతోపాటు విద్యార్హత తో కూడిన ధ్రువీకరణ పత్రాలను ఏదైనా గెజిటెడ్ అధికారితో అటే స్టెడ్ చేయించి వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయం, కడప లో08-09-2023తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఇవ్వవలసినదిగా ఆమె కోరారు, ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ13-09-2023 కాగా, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు, ఈ పోస్టులకు సంబంధించి అన్ని గ్రామ సచివాలయాల నోటీస్ బోర్డ్ లలో ఉంచడం జరిగిందని ఆమె తెలిపారు.

About Author