PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి

1 min read

– జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య నిర్వహణాధికారి రమణ

పల్లెవెలుగు, వెబ్ కర్నూలు : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, శాప్, విజయవాడ వారి ఆదేశాల మేరకు  2023 సంవత్సరంకుగాను వైఎస్సార్  లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య నిర్వహణాధికారి రమణ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.  క్రీడారంగంలో జాతీయ / అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు అర్హులన్నారు. అవార్డు కోసం  అర్హులైన వారు దరఖాస్తులను నేరుగా ఏపీ  రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి మెయిల్ [email protected] లేదా [email protected] కు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పంపాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య నిర్వహణాధికారి రమణ పేర్కొన్నారు.

About Author