PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెగ్యులర్ తాసిల్దార్ ను నియమించండి

1 min read

– రైతు, ప్రజాసంఘాల డిమాండ్
పల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం మండల కేంద్రంలో రెగ్యులర్ తహసిల్దార్ లేకపోవడం మూలంగా భూ రికార్డుల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, అనేక సంవత్సరాల నుంచి సాగులో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుందని అందుకు ఉదాహరణ పిన్నాపురం గ్రామమే అని రైతు, ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు బుధవారం నాడు పాణ్యం లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ. అనేక సంవత్సరాలుగా సాగులో ఉన్న రైతుల పేర్లు చేర్చకపోవడం వల్ల పిన్నాపురం గ్రామంలో నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందని, అధికారులు, అధికార పార్టీ నాయకులు అండదండలు ఉన్నవారు, చెప్పినట్లు వారి అనునాయుల పేర్లు రెవిన్యూ రికార్డుల్లో ఎక్కిస్తూ వాస్తవ సాగుదారుల కడుపులు కొట్టుచున్నారని అందుకు కేంద్ర బిందువుగా తాసిల్దార్ కార్యాలయంలోని రెవెన్యూ రికార్డుల తారుమారు బాగోతం అందరికీ తెలిసిందేనని, కేవలం సోలార్ ప్రాజెక్టు లో భూములు కోల్పోయిన వారి పేర్లు నమోదులో జరిగిన అవగతవకలను బయట పెట్టకుండా ఉండేందుకే పాణ్యం మండలంలో రెగ్యులర్ తాసిల్దారును నియమించకుండా అధికార పార్టీ అండదండలు ఉన్న ఇన్చార్జి తహసిల్దారును ఏర్పాటు చేసుకొని కాలయాపన చేయటం వల్ల ప్రజలందరికీ నష్టం జరుగుతున్నది. కావున జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని పాణ్యం మండల కేంద్రంలో రెగ్యులర్ తాసిల్దార్ను నియమించాలని, సోలార్ నిర్వాసితులకు న్యాయం చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాణ్యం లోని మార్కెట్ యార్డు నందు సోలార్ ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యపై ప్రజాసంఘాలు, పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగినది. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి A.రాజశేఖర్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే .ప్రభాకర్ రెడ్డి గారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి t. కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు లాయర్ బాబు , ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు వెంకటాద్రి, మాల మహానాడు నాయకులు దత్తు, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నాయకులు ప్రతాప్, కొండ జూటూరు రైతు నాయకులు కేశవ, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు దానం మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు, సిఐటియు మండల నాయకులు కే.. భాస్కర్ పాల్గొన్నారు.

About Author