కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ గా ఆప్టా సేవలాల్ నాయక్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఫ్యాప్టొ రాష్ట కార్యవర్గ ఆదేశాల ప్రకారం 2025 -27 కు గాను కర్నూలు జిల్లా FAPTO కార్యవర్గ ఎన్నిక కర్నూలు జిల్లా ఎస్ టీ యు భవన్ యందు 26.03.2025 వ సాయంత్రం 5 గంటలకు జరిగింది.ఈ కార్యక్రమం నకు రాష్ట్ర పరిశీలకుడు గా రాష్ట్ర ప్యాప్తో కో ఛైర్మన్ మరియు కర్నూలు జిల్లా ఫాప్తో ఇంచార్జి కాకి ప్రకాష్ రావు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమం యందు 13 సభ్య సంఘాల జిల్లా అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి హాజరు కావడం జరిగింది.ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్( ఆప్టా) జిల్లా ప్రధాన కార్యదర్శి సేవాలాల్ నాయక్ ను ఫెప్టో కర్నూలు జిల్లా ఛైర్మన్ గా , సెక్రెటరీ జనరల్ గా జి భాస్కర్ (బి టి ఎ),కో ఛైర్మన్ లు గా వై నారాయణ (HMA),వి జి వెంకట రాముడు (డి టి ఎఫ్), ఎస్ గులాబ్ భాష (రూట), రాజేష్ (ఎస్ సి/ఎస్ టి యూనియన్) డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా యు రవికుమార్ (యు టి ఎఫ్), టి కె జనార్ధన్ (ఎస్ టి యు), ఎస్ ఇస్మాయిల్ (ఎ పి టి ఎఫ్ 1938), కోశాధికారి గా ఎన్ రంగన్న (ఎ పి టి ఎఫ్ 257) నుండి ఎన్నిక కావటం జరిగింది.ఈ ఎన్నిక కార్యక్రమము లో నవీన్ పాటిల్ (యు టి ఎఫ్), ఎస్ గోకారి (ఎస్ టి యు),మరియనందం(ఎ పి టి ఎఫ్ 1938), తిమ్మప్ప (డి టి ఎఫ్) మధుసుధన్ రెడ్డి (ఆప్టా) మొదలైన జిల్లా నాయకులు పాల్గొనటం జరిగింది.