భారత ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ నియామకం
1 min readపల్లెవెలుగువెబ్ : భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం ఓ ప్రకటన చేశారు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ డీవై చంద్రచూడ్ కు ఆయన అభినందనలు తెలిపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ చంద్రచూడ్… ప్రస్తుత సీజేఐ జస్టిస్ లలిత్ తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్నారు. నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ లలిత్ ను తదుపరి సీజేఐని సూచించాలంటూ ఇటీవలే కేంద్రం కోరిన సంగతి తెలిసిందే.