తపాల శాఖలో కమీషన్ ఏజెంట్ల నియామకం
1 min read
పల్లెవెలుగువెబ్ : భారతీయ తపాలా శాఖ వారు కమీషన్ ఆధారంగా తపాలా జీవిత భీమా, గ్రామీణ తపాలా జీవిత భీమా పాలసీలు సేకరించడానికీ ఏజెంట్లను నియమిస్తున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పాస్ అయ్యి 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ యువత, మాజీ జీవిత సలహాదారులు, ఏదైనా బీమా కంపెనీ మాజీ ఏజెంట్లు, మాజీ సైనిక ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, హైదరాబాద్ సిటీ ప్రాంతంలో ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.