PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశ్వ హిందూ పరిషత్​ నగర ఉపాధ్యక్షులు గా నాగరాజు నియామకం

1 min read

పల్లెవెలుగు,కర్నూలు వెబ్​: విశ్వ హిందూ పరిషత్ కర్నూలు నగర ఉపాధ్యక్షులు గా శివపురం నాగరాజు ను నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి తెలిపారు. ఈరోజు కర్నూలు నగరం లో జీ. పుల్లారెడ్డి భవన్ లో జరిగిన కార్యకర్తల సమావేశానికి జిల్లా అద్యక్షులు గోరంట్ల రమణ అధ్యక్షత వహించి కర్నూలు నగరం లోని వివిధ వార్డుల నుండి వచ్చిన యువకులకు కండువా వేసి విశ్వ హిందూ పరిషత్ , బజరంగ్ దళ్ లోకి ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. నూతనంగా కర్నూలు నగర ఉపాధ్యక్షులుగా నియమితులైన శివ పురం నాగరాజు మాట్లడుతూ నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విశ్వ హిందూ పరిషత్ బలోపేతానికి కృషి చేస్తానని తెలియ చేశారు. ఈ సమావేశం లో బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ టి. ప్రతాప్ రెడ్డి,విశ్వ హిందూ పరిషత్ నాయకులూ జి.సుబ్రమణ్యం, భాను ప్రకాశ్, గోవిందరాజులు, నాగరాజు లు తదితరులు పాల్గొన్నారు.

About Author