NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్​టీఆర్​ సేవా సంఘం కమిటీ నియామకం

1 min read

పల్లెవెలుగు, వెబ్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ కమిటీతీర్మానం ప్రకారం ఎన్టీఆర్ జిల్లా కమిటీలో సభ్యులను నియామకం జరిగింది. ఎన్నికైన సభ్యులకు నియామక పత్రాలు జారీ చేశారు. స్థానిక గాంధీనగర్ లో ఆదివారంజరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండసుబ్బారావు మాట్లాడుతూ ఈరోజు గిరిజన సేవా సంఘం భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించడం జరిగిందని, సంఘ అభ్యున్నతికి ప్రణాళిక తయారు చేయడం మరియు వారి సమస్యలు పరిష్కారాలు కొరకు చేపట్టవలసిన భవిష్యత్తు కార్యాచరణ , పై చర్చించడం జరిగిందని,గరిజన సంక్షేమ సంఘం సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారని ఆయన అన్నారు. గరిజనులు రాజకీయంగా ఎదుగుటలేదు రాజకీయంగా 1% పదవులుమాత్రమే ఇస్తున్నారని అన్ని జిల్లాల్లో ఉన్న గిరిజనులకు న్యాయం జరిగేటట్లు ఉండాలని ఆయన అన్నారు. జిల్లా కమిటీ ఏర్పాటులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అని ,గిరిజనుల అభివృద్ధి కొరకు చేపట్టవలసిన ప్రణాళిక తయారు చేయుట వారి సమస్యలు పరిష్కారాలు కొరకు చేపట్టవలసిన కార్యాచరణ సూచించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రెటరీ బి.జగనవ ర్కింగ్​ ప్రసిడెంట్​ ,బలజీ నాయక్, ఫైనాన్స్ సెక్రటరీ దీపక్ నాయక్ ఆంధ్రప్రదేశ్ గిరిజనులు సంక్షేమ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author