కొల్లేరు అభయారణ్య పరిరక్షణకు.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నియామకం..
1 min readకొల్లేరు అభయారణ్యం ఐదవ కాంటూరు పరిధిలో ఎక్కడ అక్రమ చేపల చెరువులు త్రవ్వకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు..
52 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తో టాస్క్ ఫోర్స్
అక్రమ చేపల చెరువులు త్రవ్వకాలకు పాల్పడే వారిపై వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం చర్యలు
వన్యప్రాణుల విభాగం డివిజనల్ అటవీ శాఖ అధికారిణి యం. హిమ శైలజ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కొల్లేరు అభయారణ్యం ఐదవ కాంటూరు పరిధిలో ఎక్కడ అక్రమ చేపల చెరువులు త్రవ్వకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వన్యప్రాణుల విభాగం డివిజనల్ అటవీ శాఖ అధికారిణి యం. హిమ శైలజ తెలిపారు. అందులో భాగంగా పైడిచింతపాడు, మల్లవరం, బొబ్బిలిలంక గ్రామాలలో పర్యటించడం జరిగిందన్నారు. కొల్లేరు 5వ కాంటూరు పరిధిలో ఎటువంటి అక్రమ చేపల చెరువుల త్రవ్వకాలు జరపకుండా పటిష్టమైన నిరోధక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ వారు ఇప్పటికే అటవీశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. కొల్లేరు అభ అరణ్యం పరిధిలో అక్రమ చేపల చెరువు త్రవ్వకాలు జరుగుతున్నాయని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కొల్లేరు అభ అరణ్య పరిరక్షణ కొరకు రాజమండ్రి ముఖ్య అటవీ సంరక్షణ అధికారి వారి ఆదేశాల మేరకు డివిజనల్ అటవీశాఖ అధికారి వన్యప్రాణుల విభాగం వారి అధ్యక్షతన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నియమించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి రాజమండ్రి సర్కిల్ పరిధిలోని అటవీశాఖ అధికారులను, సిబ్బందిని ఏలూరు వన్యప్రాణుల విభాగం కార్యాలయంలో సమావేశపరిచి వారికు అభయారణ్యం పరిరక్షణపై తగు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. సుమారు 52 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కలిసి కొల్లేరు అభయారణ్యంలో ప్రభుత్వ భూములలో చెరువులు తవ్వకాలు జరగకుండా తనిఖీ చేయడం జరిగిందన్నారు, అందులో భాగంగా పైడి చింతపాడు , మల్లవరం, బొబ్బిలిలంక గ్రామాలలో పర్యవేక్షించడం జరిగిందన్నారు. కొల్లేరు 5వ కాంటూరు పరిధిలో ఎటువంటి అక్రమ చేపల చెరువులు త్రవ్వకాలు జరపరాదని అట్లు జరిపిన వారిపై వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ ను కొల్లేరు అరణ్యంలో నిరంతరం గస్తీ తిరుగుతూ ఎక్కడ అక్రమ చేపల చెరువులు త్రవ్వకాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ ఆమె స్పష్టం చేశారు.