కర్నూలు అసెంబ్లీ తెలుగు యువత అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు నియామకం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు అసెంబ్లీ తెలుగు యువత అధ్యక్షుడిగా సముద్రాల శ్రీధర్ బాబును టిజి భరత్ నియమించారు. ఈ మేరకు నగరంలోని మౌర్య ఇన్ లో ఆయన శ్రీధర్ కు నియామక పత్రం అందజేశారు. కర్నూల్ లో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా భరత్ చెప్పారు. తెలుగు యువత అధ్యక్షుడిగా తనను నియమించినందుకు శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు. టిజి భరత్ కు కృతజ్ఞతలు తెలిపారు.