ఏలూరు జిల్లా డ్వామా పీడీగా తూతిక శ్రీనివాస్ నియామకం
1 min read– గతంలో ఉత్తమ అధికారిగా పనిచేసి గుర్తింపు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా ద్వామా పిడిగా తూతిక శ్రీనివాస విశ్వానాథ్ ను నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. విశ్వనాథ్ గతంలో పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ అదికారిగా విశేష సేవలు అందించారు. గ్రామ ప్రణాళిక అమలు నమోదులో పశ్చిమగోదావరి జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపారు. అలాగే సామాజిక బద్రతా పించను, వైయస్సార్ కానుక పథకం అమలులో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపి ప్రశంసలు అందుకున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో డ్రోన్ ల ద్వారా సూపర్ స్పీడ్ శానిటేషన్ కాన్సెప్టును పరిచయం చేసి పారిశుద్ధ్య నిర్వాహణలో నూతన వరవడి సృష్టించిన విశ్వనాథ్ కోవిడ్ సమయంలో గ్రామీణ పారిశుద్ధ్య నిర్వాహణను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రంలో ఆదర్శవంతంగా నిలిచారు. అనంతరం ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా బదిలీపై వెళ్లారు ప్రకాశం జిల్లాలో 33 సంవత్సరాల భూమి కొనుగోలు పథకం లో దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించి సుమారు 3750 మంది ఎస్సీలకు చెందిన 3750 ఎకరాలను తనఖా రుణమాఫీ కింద జీఓ 492 అమలుకు కృషి దళితుల గుండెల్లో మంచి అధికారిగా పెరు తెచ్చుకున్నారు విశ్వనాథ్ సేవలను గుర్తించి ప్రకాశం జిల్లా అప్పటి కలెక్టర్ పోలా భాస్కర్ ప్రకాశం జిల్లా పంచాయతీ అదికారిగా అవకాశం ఇస్తే కోవిడ్ ఫీవర్ సర్వే నమోదులో ప్రకాశం జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపి ఉన్నత అదికారుల ప్రశంసలు అందుకున్నారు. ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పోరేషన్ ఈ డి కార్యాలయానికి సేవలందించే సమయంలో విశ్వనాథ్ కు ప్రభుత్వం బాపట్ల జిల్లా ఎస్సీ కార్పోరేషన్ ఈడిగా అదనపు భాద్యతలు అప్పజెప్పింది. అనతి కాలంలోనే బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రశంసలు అందుకొని బాపట్ల జిల్లా పంచాయతీ అదికారిగా అధికారులు అందించిన అవకాశాన్ని అందిపుచ్చుకుని జగనన్న స్వేచ్ఛ సంకల్ప అమలులో బాపట్ల జిల్లాను రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చి బాపట్ల జిల్లా అధికారుల రాజకీయ నాయకుల. ప్రశంసలందుకున్నారు . ఉన్నత అదికారుల ఆదేశాలను అమలు చేస్తు ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్ళడంలో చొరవ చూపే అదికారిగా, సహచర ఉద్యోగులను కలుపుకుంటూ నిజాయితీగా పనిచేసే అదికారిగా పేరున్న విశ్వనాథ్ ఏలూరు జిల్లా ద్వామా,పి డి గా భాద్యతలు చేపట్టనున్నారు.