NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ పార్టీ మండల అధ్యక్షుల నియామకం..

1 min read

– 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు  నియోజకవర్గం లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  మండల, పట్టణ అధ్యక్షులను నూతనంగా ఆ పార్టీ అధిష్టానం పలువురికి పదవులు కేటాయించింది. పాతవారిని ఐదు మందిని తొలగించి ఇద్దరిని మాత్రమే అలాగే  కొనసాగించారు.పగిడ్యాల, జూపాడుబంగ్లా,  నందికొట్కూరు, పాములపాడు మండలం లో ,నందికొట్కూరు పట్టణంలో   కొత్తవారికి అవకాశం కల్పించారు .మిడుతూరు, కొత్తపల్లి  మండలంలో మాత్రమే అధ్యక్షులు గా  పాతవారినే  కొనసాగిస్తు నియమాలను చేపట్టారు. నందికొట్కూరు పట్టణంలో సైతం పాతవారిని తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం ఆయా మండలాల పార్టీ అధ్యక్షులను నియమించింది. 

వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు వీరే..

నంది కొట్కూరు నియోజకవర్గ వైకాపా సమన్వకర్త, రాష్ట్ర శాప్ చైర్మన్  వైకాపా యువజన విభాగం రాష్ట్ర  అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆశీస్సులతో నందికొట్కూరు నియోజకవర్గంలో  సిద్దార్థ రెడ్డి వర్గానికి చెందిన నేతలకు పదవులు దక్కాయి. ఇందులో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  నందికొట్కూరు మండల అధ్యక్షుడిగా బిజినవేముల సర్పంచి రవి యాదవ్, పట్టణ అధ్యక్షుడిగా మన్సూర్ అహమ్మద్  , పగిడ్యాల మండల అధ్యక్షుడిగా మాజీ జడ్పిటిసి సభ్యులు పుల్యాల నాగిరెడ్డి, జూపాడుబంగ్లా మండల అధ్యక్షుడు తోకల కృష్ణా రెడ్డి, పాములపాడు మండల అధ్యక్షుడుగా గండగారి  రామలింగేశ్వర రెడ్డి, మిడుతూరు మండల అధ్యక్షుడు గా తువ్వా లోకేశ్వర రెడ్డి, కొత్తపల్లి మండల అధ్యక్షుడు గా కె. సుధాకర్ రెడ్డి లను వైసీపీ అధిష్టానం నియమించింది.ఈ టీమ్ త్వరలో జరగబోయే ఎన్నికలకు  సమాయత్తం అవుతోంది.నందికొట్కూరు నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో  వైసీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీమ్ కృషి చేయాలి.

About Author