వైఎస్ఆర్సిపి మండల యువజన విభాగం అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా నియామకం
1 min read
చెన్నూరు, న్యూస్ నేడు: వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్సీపి మండల యువజన విభాగం అధ్యక్షులుగా పేరుసాముల నిత్య పూజయ్య, ఉపాధ్యక్షులుగా పాత కుంట కార్తీక్ రెడ్డిలు నియమితులు అయినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు గురువారం విలేకరులతో మాట్లాడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమను నమ్మి తమకు ఇచ్చిన యువజన విభాగం కు సంబంధించిన పదవులకు న్యాయం చేస్తామని, మండలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. అంతేకాకుండా మండల వ్యాప్తంగా పర్యటించి ఆయా గ్రామ పంచాయతీలలో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పార్టీ ఆదేశానుసారం మరింత బలోపేతదిశగా పార్టీ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన వ్యత్యాసం గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ప్రజలకు మెరుగైన పాలన కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే సంక్షేమం కుంటుపడుతుందని వారు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపడం దుర్మార్గమన్నారు. నేడు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అటకెక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేస్తున్నారని వారు కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కక్ష సాధింపు చర్యలకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుర్మార్గన పాలన మునుపెన్నడు చూడలేదని వారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు సమిష్టి కృషితో కూటమి ప్రభుత్వం ఆవిలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై సంఘటితంగా పోరాటం చేయడం జరుగుతుందని రాబోవు రోజులలో నియోజకవర్గ వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలపై గళం విప్పుతుందని, ఆ దిశగా పార్టీ శ్రేణుల మంత కలిసికట్టుగా పనిచేస్తామని వారు తెలియజేశారు. మా నియామకానికి కృషి చేసిన వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి, నియోజకవర్గ ఇంచార్జ్ పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.