NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ల్యాబ్ టెక్నీషియన్ కు కలెక్టర్ ప్రశంసా పత్రం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న సిహెచ్ సి వైద్యశాలలో పనిచేస్తున్న సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ ఎన్.సత్యనారాయణకు నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.శుక్రవారం ఉదయం నంద్యాల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్,ఎస్పీ ఎన్ రఘువీర్ రెడ్డి మరియు డిఎంహెచ్ఓ రమణ ప్రశంసా పత్రాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు.2013 ఆగస్టు 15న కర్నూలులో మొదటగా జిల్లా కలెక్టర్ ఈయనకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.ఈయన సేవలకు గాను ఇది రెండవసారి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.2023 జూన్ లో ఈయన నందికొట్కూరు నుండి మిడుతూరు ఆరోగ్య కేంద్రానికి బదిలీపై వచ్చారు.కలెక్టర్ నుండి ప్రశంసా పత్రం అందుకున్నందుకు గాను మిడుతూరు సిహెచ్సి సూపరింటెండెంట్ తిరుపతి మరియు సిబ్బంది సత్య నారాయన ను అభినందించారు.

About Author