1433 ఉద్యోగాల భర్తీకి ఆమోదం !
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణలోని మున్సిపల్, పంచాయతీ రాజ్ ,రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ విభాగాధిపతి కార్యాలయంలో 196 పోస్టులు, పబ్లిక్ హెల్త్‌లో236, చీఫ్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లైలో 420 పోస్టులు, 350 ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయతీ రాజ్ జనరల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.