25 వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదం !
1 min readపల్లెవెలుగువెబ్ : పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే భగవంత్ సింగ్ మాన్ దూసుకుపోతున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా 25 వేల ప్రభు త్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపారు. అందులో 15 వేల ఉద్యోగాలు పోలీస్ శాఖలో, మరో 10 వేల ఉద్యోగాలను ఇతర ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లలో భర్తీ చేస్తారు. శనివారం తొలిసారి సమావేశమైన కొత్త క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. నెలరోజుల్లోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపింది.