ఏపీపీఎస్సీ నోటిఫకేషన్ విడుదల!
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: ఆంధ్రపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సి) శుక్రవారం వివిధ శాఖల్లో 54 ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఏపీ ఇన్ఫర్మేషన్ సర్వీస్ శాఖలో డీపీఆర్వో పోస్టులు, సర్వే అండ్ ల్యాండ్ సర్వీస్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు, లెజిస్టేచర్ సర్వీస్ శాఖలో తెలుగు రిపోర్టర్, హార్టికల్చర్ శాఖలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్ వివరాలు ఇలా…
= డీపీఆర్ఓ పోస్టులు 4( ఏదైనా డిగ్రీతో పాటు జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ), వయసు 18–42ఏళ్లు, దరఖాస్తు ప్రారంభం తేదీ అక్టోబర్ 19, చివరి తేదీ నవంబర్ 11, ఎంపిక కంప్యూటర్ పరీక్ష ద్వారా ఉంటుంది.
= అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 6(ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో బీఈ లేదా బీటెక్ లేదా తత్సమాన అర్హత), వయసు 18–42ఏళ్లు, దరఖాస్తు ప్రారంభ తేదీ అక్టోబర్22 , చివరి తేదీ నవంబర్ 12, ఎంపిక కంప్యూటర్ పరీక్ష ద్వారా ఉంటుంది.
= తెలుగు రిపోర్టర్ పోస్టులు 5(డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్, తెలుగు టైప్ రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్), వయసు 18–42ఏళ్లు, దరఖాస్తు ప్రారంభ తేదీ అక్టోబర్ 18, చివరి తేదీ నవంబర్ 8, ఎంపిక కంప్యూటర్ పరీక్ష ద్వారా ఉంటుంది.
= హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు 39(హార్టికల్చర్ సబ్జెక్ట్‌తో బీఎస్సీ లేదా బీఎస్సీ హానర్స్), వయసు 18–42ఏళ్లు, దరఖాస్తు ప్రారంభ తేదీ అక్టోబర్ 11, చివరి తేదీ నవంబర్ 2, ఎంపిక కంప్యూటర్ పరీక్ష ద్వారా ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు విధానం ఇలా…
Step 1- అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
Step 4- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 5- యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
Step 6- ఆ తర్వాత లాగిన్ అయి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి.
Step 7- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.
Step 8- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
Step 9- పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Step 10- అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.