NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రూప్ 2 పరీక్షలు నిర్వహణపై ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ ఆర్.అనురాధ సమీక్ష

1 min read

జిల్లా కలెక్టర్, ఎస్పీ,ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

 వీడియో కాన్ఫరెన్స్

పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను, మార్గదర్శకాలపై వివరణ

పాల్గొన్న కలెక్టర్ వెట్రి సెల్వి,ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి

పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ఏపీపీఎస్సీ  గ్రూప్-2 పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, పి4 మోడల్ సర్వే,  ఎంఎస్ఎంఈ సర్వే,జిల్లా వారీగా  పర్ ఫెక్షన్ ట్రాకింగ్, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లు,ఏస్ పి లు, సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సమీక్షించారు. ఈ సందర్బంగా ఏపీపీఎస్సీ  గ్రూప్-2 పరీక్షలు నిర్వహణపై ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ ఏ. ఆర్.అనురాధ సమీక్షించారు.పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు,మార్గదర్శకాలను వివరించారు.ఏలూరు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి,జిల్లా ఎస్పీ కె పి ఎస్ కిషోర్ ,జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.సమావేశంలో అడిషనల్ ఎస్పి ఎన్.సూర్య చంద్రరావు, జడ్పీ సీఈఓ కె.సుబ్బారావు, డి ఆర్ డి ఎ పిడి ఆర్.విజయరాజు,డ్వామా పిడి కె. వి.సుబ్బారావు,డిఈఓ వెంకట లక్ష్మమ్మ,డివిఈఓ ప్రభాకరరావు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వర రావు,సిపిఓ సి  హెచ్ వాసుదేవరావు, డిఆర్డీఏ పిడి ఆర్.విజయరాజ, జడ్పి సిఈఓ కె.సుబ్బారావు, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ  ఆయా శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు.

About Author