ఏప్రిల్ 22 ప్రపంచ ఎర్త్ డే…
1 min read
2025 ఏప్రిల్ తో 55వ వార్షికోత్సవం
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా నిర్వహిద్దాం
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పర్యావరణ సమస్యలపై అవగాహన కల్పిస్తూ. భూమిపై ప్రభావం చూపే సమస్యలపై పరిష్కరించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన వరల్డ్ ఎర్త్ డే, నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రపంచంవ్యాప్తంగా అధికారులు స్వచ్చంద సంస్థలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్యావరణ సంరక్షనను ప్రోత్సహిస్తున్నారు. ఐతే దీనిని ఎప్పుడు ప్రారంభించారు. ఈ స్పెషల్ డే వెనుక కారణాలు ఏంటి ఈ ఏడాది పాలో అయ్యే థీమ్ ఏంటి వంటి విషయాలు చూసేద్దాం.ఎలామొదలైందంటేవరల్డ్ ఎర్త్ డేని తొలిసారి 1970 ప్రారంభించారు. 1969లో యూఎస్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ భూమి ప్రమాదంలో ఉందని తెలిపారు. అప్పటినుంచి ఎర్త్ డే ని పాటించాలని కోరారు. ఆ తర్వాత 1969లో జరిగిన ఆయిల్ స్పీల్ తర్వాత సెనేటర్ గేలార్డ్ నెల్సన్ అమెరికాలో 1970 ఏప్రిల్ 22వ తేదీన భూమి దినోత్సవన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 2 కోట్ల మంది అమెరికన్లు పాల్గొనడంతో పర్యావరణం పరిరక్షణలో పలు చట్టాలు ఏజెన్సీలు మొదలైయ్యాయి,1990 నాటికీ ప్రపంచంవ్యాప్తంగా 141 యొక్క దేశాలకు ఈ ఎర్త్ డే విస్తరించింది. దీనిలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ.పర్యావరణ పరిరక్షణకు మద్దతుఇవ్వడమే లక్షయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ.పలు కార్యక్రమాలు ర్యాలీలు ప్రచారాలు చేస్తున్నారు. 2025 ఏప్రిల్ తో ఎర్త్ డే 55వ వార్షికోస్తవం జరుపుకుంటుంది. దీనితో వరల్డ్ ఎర్త్ డే తీమ్ గా తీసుకువచ్చారు.