ఏపీఎస్ఆర్టీసీ.. రోజుకు అదనంగా రూ. 32 లక్షలు ఖర్చు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీఎస్ఆర్టీసీకి రోజుకు రూ.32 లక్షలు అదనంగా ఖర్చవుతోందని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ఏడాదికి 30 కోట్ల లీటర్ల డీజిల్ కొంటోందని పేర్కొన్నారు. మార్చి 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రాబోతున్నాయని వెల్లడించారు. డీజిల్ ధరలు పెరిగినా టికెట్ ధరలు పెంచలేదన్నారు. ఏలూరు, రాజోలు, రంగంపేట, ఉరవకొండలో ఏపీఎస్ఆర్టీసీకి రిటైల్ పెట్రోల్ బంకులున్నాయని తెలిపారు. రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. బల్క్ రేట్లు తగ్గితే ఆయిల్ తయారీ సంస్థల నుంచి తిరిగి కొంటామన్నారు. అలాగే త్వరలో 100 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రయోగాత్మకంగా 100 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చుతామన్నారు.