PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

“కొమ్మినేని”కి ఏపీయూడబ్ల్యూజే అభినందనలు

1 min read

పల్లెవెలుగు, వెబ్ విజయవాడ : సీ రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధుల బృందం గురువారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు అవసరమైన శిక్షణా తరగతులను నిర్వహిస్తూ అందుకు తగిన విధంగా పుస్తకాలను ముద్రించి జర్నలిస్టులకు పంపిణీ చేస్తామన్నారు. కొమ్మినేనిని కలిసిన అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి అభినందించిన వారిలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, విజయవాడ అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మరాజు చలపతిరావు, ఆర్ వసంత్, ఐజేయూ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు, ప్రెస్ అకాడమి కార్యదర్శి తిలక్ తదితరులు ఉన్నారు.

About Author