అంగన్వాడీ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన ఏపీడబ్ల్యూజేఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : 18వ రోజు కొనసాగుతున్న అంగనవాడి వర్కర్లు ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మెకు పత్తికొండ తాలూకా ఏపీడబ్ల్యూజేఎఫ్ పూర్తి మద్దతు ప్రకటించింది. శుక్రవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ తాలూకా కార్యదర్శి రాముడు, ఉపాధ్యక్షులు రవిచంద్ర జిల్లా నాయకులు చక్రాల రాముడు సీనియర్ జర్నలిస్ట్ గిడ్డయ్య అంగన్వాడీల సమ్మె శిబిరానికి చేరుకొని వారికి మద్దతు పలికారు. ఈ వారు మాట్లాడుతూ, అంగనవాడి వర్కర్లు ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మెకు వర్కింగ్ జర్నలిస్టులు పూర్తి మద్దతుగా వారి సమస్యలను ప్రజలకు తెలియజేసే విధంగా వార్తలను ప్రచురిస్తామని తెలిపారు. అలాగే వారి న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తీర్చేంతవరకు వారికి తమ నుండి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.