నేడు ఏపీడబ్ల్యూజెఎఫ్ జిల్లా ప్రధమ మహాసభ..
1 min readముఖ్య అతిథులుగామంత్రి కారుమూరి, మాజీమంత్రి ఆళ్ళ నాని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రజలకు ప్రభుత్వానికి వారధి వంటి మీడియాలోజర్నలిస్టుల బాధ్యత గురుతరమైందని మాజీ డిప్యూటీ సి ఎం,ఏలూరుఎమ్మెల్యే ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నానీ) అన్నారు.ఏపీ డబ్ల్యూజేఎఫ్ ఏలూరు జిల్లా ప్రధమ మహాసభ ఆదివారం స్థానిక కలెక్టరేట్ సమీపంలోని గిరిజన్ భవన్లో జరగనున్న సందర్భంగా శనివారంఫెడరేషన్ ప్రతినిధులునానీ తదితరులు ముఖ్య నేతలను కలిసి సమా వేశానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆళ్ళ నానీ మాట్లాడుతూ పాత్రికేయుల సంక్షేమం పైప్రభుత్వానికి అవగాహనవున్నదని చెప్పారు.కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సి ఎంఅళ్లనానీ, రాష్ట్రపౌర సరఫరాలు, వినియోగదారుల మంత్రిడా:కారుమూరి వెంకట నాగేశ్వరరావు ముఖ్య ఆతిధులుగా విచ్చేయనున్నారు.విశిష్ట అతిథులుగాఉభయ జిల్లాలజెడ్ చైర్ పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాదరావు,ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి,చింతల పూడి ఎమ్మెల్యే వి ఆర్ ఎలీజా, పోలవరం శాసన సభ్యులు బాలరాజు,నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావుజిల్లా లోని మిగతా శాసన సభ్యులు అందరూ విచ్చేయనున్నారని ఫెడరేషన్ నాయకులువెల్లడించారు. ఏలూరు తెదేపా ఇంచార్జి బడేటి చంటి వివిధ సంఘాలజిల్లా నేతలు జిల్లా అధికారులు పాల్గొననున్నరని తెలిపారు. బీజేపీ, జనసేన, అధికార వైసిపి ముఖ్య నాయకులు మరియు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు జిల్లాలోని ఏడు నియోజక వర్గకమిటీల ప్రతినిధులుపాల్గొననున్నారు. అన్ని పత్రికల జర్నలిస్టులు, వివిధ చానళ్ల ప్రతినిధులుపాల్గొననున్నారని ఫెడరేషన్ ప్రతినిధులు ఎస్ డి జబీర్, కె బాలశౌరీ, కె ఎస్ శంకర రావు, ఎన్ గోపాలకృష్ణ, యర్రా జయ దాస్ తెలిపారు.