తుపాకీతో కాల్చుకుని ఏఆర్ అధికారి ఆత్మహత్య
1 min read
పల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ కు చెందిన హోంగార్డ్స్ విభాగం ఏఆర్ అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విజయనగరం జిల్లా హోంగార్డ్స్ విభాగం ఏఆర్ అధికారి ఈశ్వర్ రావు పోలీస్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నాడు. ఉదయం తన వద్ద ఉన్న రివాల్వర్ తో రెండు రౌండ్లు కాల్చుకున్నాడు. అతని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.