వివాహ బంధంలోకి ఏఆర్ రెహ్మాన్ కుమార్తె .. వరుడు ఎవరంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఆస్కార్ అవార్డు గ్రహీత , ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్. రెహ్మాన్ పెద్ద అమ్మాయి ఖతిజా రెహమాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇదే విషయాన్ని ఖతిజా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఆ దేవుడి ఆశీర్వాదాలతో.. ఈ విషయం మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఆడియో ఇంజినీర్, పారిశ్రామికవేత్త రియాస్దీన్ షేక్ మహమ్మద్‌తో డిసెంబర్ 29న నిశ్చితార్థం జరిగింది. అదే రోజు నా పుట్టిన రోజు కావడం మరింత సంతోషంగా ఉంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు.’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా పోస్ట్ చేశారు.