NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిజెపి రాయచోటి అసెంబ్లీ కన్వీనర్ గా ఆరమాటి శివగంగి రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీ కన్వీనర్ గా నియమించినట్లు ఆరామాటి శివగంగి రెడ్డి ప్రకటన ద్వారా తెలియజేశారు. నాపై నమ్మకం ఉంచి నన్ను అసెంబ్లీ కన్వీనర్ గా నియమితులయ్యేందుకు సహకరించిన జాతీయ నాయకులు సత్యకుమర్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శశి భూషణ్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు ఎవి సుబ్బారెడ్డి గారితో పాటు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరు న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజస్తున్నానన్నాను. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో ప్రతి భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కలుపుకొని పోతూ రాబోవు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. అనంతరం నియోజకవర్గపు భారతీయ జనతా పార్టీ నాయకులు అసెంబ్లీ కన్వీనర్ గా ఎన్నికైన శివగంగ రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు జి వెంకటేష్, అన్నమయ్య జిల్లా కాపు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి రెడ్డి ప్రసాద్ రాయల్, చంద్రశేఖర్ రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రేపన శివప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, జయచంద్ర, సురేష్, జగదీష్, నాగరాజ గంగాధర్ నాయుడు తదితర భాజపా నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ఘనంగా పూల బొకే సాలువతో సన్మానించారు.

About Author