జిల్లా ద్వామా పీడీగా అరవపల్లి రాము బాధ్యతలు
1 min read– మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ సీఈవో రవికుమార్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏలూరుజిల్లా ద్వామా పి డి గా అరవపల్లి రాము శనివారం బాధ్యతలు చేపట్టారు.ఇప్పటివరకు ఇక్కడ పి డి గా పనిచేసిన రాంబాబు కమిషనరేట్ కు రిపోర్ట్ చేయనున్నారు.ఏలూరు ద్వామా పి డి గా బాధ్యతలు చేపట్టిన రాము 1999లో ఎం పి డి ఓ గా ఎంపికయ్యి తొలుత నల్లజార్ల ఎం పి డి ఓ గాను తరువాత చాగల్లు.తాళ్లపూడి.ఉంగుటూరు.కొవ్వూరు.నిడదవోలు ఎం పి డి ఓ గా పనిచేశారు.అక్కడనుండి పదోన్నతి పై సెక్రటేరియట్ లో లీగల్ సెక్షన్ లో కోర్ట్ కేసులు పరిష్కార విభాగం లో పని చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు.ప్రభుత్వం ఏలూరుజిల్లా ద్వామా పి డి గా పోస్టయి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం శని వారం ఏలూరు పి డి గా బాధ్యతలు చేపట్టామని ఏలూరుజిల్లా మెట్రో టి వి ప్రతినిదికి తెలిపారు.శని వారం విధులు చేపట్టిన రాము ని జిల్లా పరిషత్ సీఈవో మర్యాదపూర్వకంగా కలిసి స్వీట్ తినిపించారు. పలువురు జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియ జేశారు.