లోన్ యాప్ ఏజెంట్లు వేధిస్తున్నారా ?.. అయితే ఇలా భయటపడండి !
1 min readపల్లెవెలుగువెబ్ : డబ్బు అవసరం ఉంది అనిపిస్తే.. ప్రజలు లోన్ యాప్ ల వైపు చూస్తున్నారు. ఏదో అవసరం తీరుతుందని ఆశ పడితే.. ఆ తరువాత అసలైన కష్టాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ లో విపరీతమైన లోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించని యాప్ లు కోకొల్లలుగా ఉన్నాయి. అవసరానికి అందులో నగదు తీసుకోవడం.. ఆ తరువాత ఇబ్బందులకు గురి కావడం వాటివి చాలానే జరుగుతున్నాయి. ఈ లోన్ యాప్ ఆగడాలకు ఆత్మహత్య చేసుకొనే వారి సంఖ్యా రోజు రోజుకు పెరిగిపోతుంది. తియ్యగా లోన్ ఇస్తామని.. కాంటాక్ట్స్., వ్యక్తిగత డేటా తస్కరించి… బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న ఘటనలు తరచు చుస్తున్నాం. పోలీసులు అప్రమత్తం చేసిన అవసరాలకు లోన్ యాప్ ల్లో అప్పులు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రుణయాప్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. కొత్త యాప్ ను డౌన్ లోడు చేసుకోవద్దంటున్నారు. అలాగే తెలియని వారితో ఫోన్ లో స్నేహం చేయవద్దు అంటున్నారు. అలాగే ఏదైనా ఆన్ లైన్ యాప్ ఏజెంట్ లు వేధింపులు మొదలు పెడితే.. వెంటనే పోలీసులను ఆశ్రయించాలి అంటున్నారు. కపడ జిల్లాలో ఎవరైనా బాధితులుంటే 100, 944796900 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.