అభివృద్ధిపై టిడిపి నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా!
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : అభివృద్ధిపై తెలుగుదేశం నాయకులు మాట్లాడడం హాస్య స్పదంగా ఉందని, వైఎస్ఆర్సిపి కమలాపురం నియోజకవర్గం మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష అన్నారు, గురువారం ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, కొంతమంది టిడిపి నాయకులు తెలుగుదేశం పార్టీ ఎక్కువ వార్డు మెంబర్ కు తక్కువైన వారు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే, బాదేస్తుందని అలాంటివారు మాట్లాడే ముందు నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఆయన అన్నారు, తెలుగుదేశం హయాంలో మైనార్టీలకు ఎంత మాత్రం గౌరవం ఇచ్చారు తెలుసుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు, తెలుగుదేశం మైనార్టీలుఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇచ్చిన దాకాలు లేవని తెలిపారు, ఇకపోతే హజ్ హౌస్ దీనిని గురించి తెలుగుదేశం పార్టీ వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, తెలుగుదేశం పార్టీ హయాంలో స్వార్థం కోసం, కమిషన్ల కోసం హజ్ హౌస్ ను నిర్మించారు తప్ప, మైనార్టీలకు ఏ విధంగా ఉపయోగపడకుండా కట్టడం జరిగిందని తెలిపారు, దీనివల్ల 14 ఎకరాల భూమి కూడా ఉపయోగం లేకుండా పోయిందని ఆయన తెలుగుదేశం పార్టీ వారిపై మండిపడ్డారు, అలాగే మైనార్టీలు సమస్యలపై పోరాడిన, మాట్లాడిన దేశద్రోహం కేసులు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ దేనని ఆయన ఆరోపించారు, వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మైనార్టీలకు పదవులతో పాటు అత్యంత గౌరవ మర్యాదలు ఉన్నాయని ఆయన అన్నారు, వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో సొంత రాష్ట్రం నుండి హజ్ కు వెళ్లే ఏర్పాట్లు అన్నింటిని కూడా చూడడం జరిగిందన్నారు, మైనార్టీలకు ఏదైనా ఉపకారం చేశారంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనార్టీలకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మైనార్టీల పక్షపాతిగా మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగిందన్నారు, ఇప్పుడు ఆయన తనయులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గత ప్రభుత్వంలో దుల్హన్ పథకం ద్వారా 50వేల రూపాయలు ఇస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుల్హన్ పథకం ద్వారా లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు, ఇకపోతే రంజాన్ తోఫా, హెరిటేజ్ లో అమ్ముడు పోక కుళ్లిపోయి ,పాచిపోయిన నెయ్యి అలాగే సేమ్యాలు ఇచ్చినంత మాత్రాన మైనార్టీలకు ఏదో వరగ పెట్టినట్లు మాట్లాడడం సరికాదన్నారు, కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి నిత్యం ప్రజలలో ఉంటూ, ప్రజా సమస్యలు వింటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూపడం జరుగుతుందని ఆయన తెలిపారు, అంతే అంతేకానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా, స్థలాలకు, భూములకు పంచాయతీలు చేయడం లేదన్నారు, ఇకనైనా మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడకుండా, చిత్తశుద్ధితో మాట్లాడాలని ఆయన టిడిపి నాయకులకు హితవు తెలిపారు.. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ మునీర్ , అబ్దుల్ రబ్, కరీం, తదితరులు పాల్గొన్నారు.