ఒత్తిడిలో ఉపాధ్యాయులు.. పోరాటాలకు సిద్ధమా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రభుత్వ ఉపాధ్యాయుల పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. హాజరు, సమయపాలన, బేస్‌లైన్ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ అంటూ ఏ కోణంలో విఫలమైనా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఓవైపు పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు పోరాటం చేస్తుంటే, మరోవైపు నుంచి ప్రభుత్వం వారిపై ఒత్తిడి చేసే ప్రణాళిక అమలుచేస్తోంది. తద్వారా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదని, పోరాటాలు, ఉద్యమాలకు తావివ్వకూడదని భావిస్తున్నట్టు సమాచారం. బేస్‌లైన్ పరీక్షల్లో ‘ప్రతిభ’ కనపరచలేదంటూ శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 621 స్కూళ్ల హెచ్‌ఎంలకు ఆ జిల్లా విద్యాధికారి నోటీసులు జారీ చేశారు. ప్రకాశం, కర్నూలు జిల్లాలకూ భారీగా తాఖీదులు వెళ్లాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు, సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ వృత్తి జీవితంలో ఇంతటి ఒత్తిడిని ఎప్పుడూ ఎదుర్కోలేదని, ఒకప్పుడు ఉద్యమాలు చేసే స్థితి నుంచి ఇప్పుడు ప్రశ్నించేందుకు కూడా అవకాశం లేని దుస్థితికి చేరుకున్నామని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.