ముగ్గురిని కనేందుకు చైనీయులు సిద్ధమేనా ?
1 min readపల్లెవెలుగు వెబ్: ముగ్గురు పిల్లల్ని కనేందుకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనాభా నియంత్రణ మీద ఆంక్షలు సడలించింది. అయితే దీని మీద సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చైనా ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ప్రసూతి సెలవుల విషయంలో ఇబ్బందిపడాల్సి వస్తుందని మహిళా ఉద్యోగులు అభిప్రాయపడుతన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకుండా… ముగ్గురు పిల్లల్ని కనొచ్చని అనుమతి ఇవ్వడం సరికాదన్న అభిప్రాయం నెలకొంది. ప్రధానంగా పిల్లల చదువులు, వారి పోషణ భారం పెరగడంతో ఒక బిడ్డ చాలనే అభిప్రాయం చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. ప్రస్తుత ధరల్లో ముగ్గురు పిల్లల్ని పోషించడం అంటే తలకు మించిన భారం అవుతుందని అంటున్నారు. కేవలం పెద్దల ఒత్తిడితోనే ఇద్దరు పిల్లల్ని కంటున్నారు. అంతేకాని చాలా మంది యువత ఒక బిడ్డ చాలనే అభిప్రాయంతో ఉన్నారు.