NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌చ్చి బ‌ఠానీలు తింటున్నారా .. లాభాలేమిటో తెలుసుకోండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పచ్చి బఠానీలను సాధారణంగా చాలా మంది కూరల్లో, కుర్మాలో వేస్తుంటారు. ఇవి చక్కటి రుచిని కలిగి ఉంటాయి. కొందరు వీటిని వేయించుకుని ఉప్పూకారం గరం మసాలా చల్లుకుని స్నాక్స్‌లా కూడా తింటారు. నిత్యం వీటిని తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నిత్యం పచ్చి బఠానీలను తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగ్గా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉండవు. ఇందులో ఉండే ఫైబర్‌ మలబద్ధకాన్ని తొలగిస్తుంది. తద్ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. పచ్చి బఠానీలను తినడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్‌ అందుతుంది. ఫలితంగా రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

                                       

About Author