ముందస్తుకు ఎన్నికలకు సన్నదమా? గృహసారధుల సమావేశమా..
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం గడివేముల: రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్నట్టే కనపడుతుంది ఆ దిశగా ఊహగానాలు వెలువెత్తుతున్న నేపథ్యంలో శనివారం నాడు నియోజకవర్గంలోని 4 మండలాల కన్వీనర్ల కో కన్వీనర్ల వైకాపా ముఖ్య నాయకులు , జడ్పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచుల సమావేశం జరుగుతుండడం ఎమ్మెల్యే సమక్షంలో ఈ సమావేశానికి భారీ ఎత్తున వైకాపా నియోజకవర్గ శ్రేణులు హాజరుకావాలని ఆదేశాలు అందడంతో ఊహగానాలకు బలం చేకూరుస్తుంది పాణ్యం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలనుండి గడివేముల పాణ్యం మండలాల కన్వీనర్ల సమావేశం నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం నుండి కల్లూరు ఓర్వకల్ మండలాల కన్వీనర్ల సమావేశం నిర్వహిస్తుండడం ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందనే గ్రామాలలో పార్టీ పరిస్థితి పై ఫీడ్ బ్యాక్ కోసమే ఈ సమావేశం ఉంటుందని విశ్వసనీయ సమాచారం మూడో తేదీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైకాపా ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులతో సమావేశాలలో అభిప్రాయాలు తెలుసుకోవడానికి సమావేశమా లేక మంత్రివర్గంలో కొత్తగా నలుగురు చోటు కల్పించడానికి అభిప్రాయమా అనేది తెలియాలంటే నాలుగో తేదీ వరకు వేచి చూడాల్సిందే . మొత్తానికిి వేసవికాలంలో రాజకీయ వేడి రాష్ట్రంలో పెరిగిపోవడం ముందస్తు ఎన్నికలకు సంకేతాలు అందుతున్నట్టు రాజకీయ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు.. మరి ఆరు నెలలు ముందరే ప్రభుత్వం ఎన్నికలకు వెళుతుందా.. టిడిపికి చెక్ పెట్టి వై నాట్ 175 అనే నినాదాన్ని అంది పుచ్చుకోవడానికే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా మొత్తానికి ఏదో జరగబోతుందనే సంకేతాలను మాత్రం కోట్టి పారేయలేం.