NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓటరుగా నమోదు అవుదాం..

1 min read

పల్లెవెలుగు, వెబ్​ గోనెగండ్ల: కర్నూలు,కడప,అనంతపురం నియోజకవర్గాలలో 2023 మార్చిలో జరగనున్న ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవాలంటే తప్పకుండ అందరూ ఓటరుగా నమోదు కావాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి యస్.నరసింహులు సూచించారు.బుధవారం స్థానిక మండల కేంద్రంలోని ఏమ్మార్షి(MRC)భవనం నందు ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ తరగతులలో ఉపాధ్యాయులందరికీ ఓటరుగా నమోదు చేసుకోవడానికి గల అర్హతలను గూర్చి తెలియజేసి ఫార్మ్-18 మరియు ఫార్మ్ 19లను అందజేసిన అనంతరం మండలం UTF మరియు STU నాయకులు జిక్రియ,మల్లికార్జునయ్య లు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ,కార్మిక,నిరుద్యోగ సమస్యల పట్ల నియంతృత్వంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని,ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడానికి,మన సమస్యలను శాసన మండలిలో మన గొంతుకగా వినిపించడానికి ఉద్యమ నేపథ్యం కలిగిన నేతలను గెలిపించుకోవలసిన బాధ్యత విద్యావంతులు,మేధావి వర్గం అయిన ఉపాధ్యాయులపైన ఉందని కొనియాడారు.సామాజిక దృక్పధంతో ముందుకు సాగే నేతలు,ధన బలం లేని సామాన్యులు,నిరంతరం ఉపాధ్యాయులు,ఉద్యోగులు, కార్మికులు,యువకులు, అసహాయుల బలహీనుల కోసం ఎలుగెత్తి ప్రశ్నించే ప్రజా గొంతుక,విలువలు, విశ్వసనీయత నాయకులు పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ:కత్తి నరసింహా రెడ్డి,పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు గెలుపులో భాగస్వాములు కావాలంటే అందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యాయ సంఘ నాయకులు లక్ష్మణ్,శేఖర్ బాబు,రామ్లా నాయక్,ఉసేన్,చంద్ర,మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

About Author