నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారేమో ?
1 min read
పల్లెవెలుగువెబ్ : తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందేమోనన్న అనుమానం కలుగుతోందని ఆమె అన్నారు. గవర్నర్ కార్యాలయం రాజ్ భవన్… ప్రగతి భవన్ లా కాదని, రాజ్ భవన్ ద్వారాలు జనం కోసం నిత్యం తెరిచే ఉంటాయని కూడా ఆమె అన్నారు. ఈ మేరకు బుధవారం రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ సర్కారుపై ఆమె సంచలన ఆరోపణలు గుప్పించారు.