మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా…?
1 min read
మధుమేహం, రక్తపోటు, ఊబకాయం ఉన్న వారు కిడ్నీవ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువ
- ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే… కొంత సేఫ్..
- డా. సాయి వాణి, ప్రముఖ నెఫ్రాలజిస్ట్, కర్నూలు.
కర్నూలు, న్యూస్ నేడు:ప్రపంచ జనాభాలో 850 మిలియన్ మంది. మన దేశంలో ప్రతి వంద మందిలో పది మంది, మన రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 17 మంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. మన రాష్ట్రంలో ఎన్సిడి ఎస్ సర్వే ప్రకారం చిన్న పిల్లలో 28.6 మందికి కిడ్నీ పనితనం తగ్గినట్లు తేలింది. మన పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులో ఈ సంఖ్య 0.1 శాతం మాత్రమే ఉంది. ఏపీలో సుమారు 13,500 మంది రక్తం డయలసిస్ , 1200 మంది పొట్ట డయాలసిస్, 200 మంది కిడ్నీ మార్పిడి చేయించుకుంటున్నారు. 4 గంటల రక్తపు డయాలసిస్ కు 120 నుంచి 150 లీటర్ల నీళ్లు అవసరం ఉంటుంది. ఒక రక్తపు డయాలసిస్ లో 1.5 నుంచి 2 కేజీ ల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తాయి. ఇవి గ్లోబల్ వార్మ్ కు కారణమై మన వాతావరణానికి చాలా చెడు జరుగుతుంది. దీనిన నివారించడానికి మనం తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
కలుషిత నీరు తాగితే… :
మంచి ఆహారం, కలుషితం లేని మంచి నీరు తాగడం వల్ల కిడ్నీ వ్యాధులను నివారించవచ్చు.
ప్రైమరీ ప్రీవెన్షన్ :
కిడ్నీ వ్యాధులు రావడానికి ముఖ్య కారకాలు.. మధు మేహం, రక్త పోటు, ఊబకాయం. ఈ వ్యాధులు రాకుండా చూసుకోవడాన్ని ప్రైమరీ ప్రీవెన్షన్ అంటారు.
సెకండరీ ప్రీవెన్షన్ :
కిడ్నీ వ్యాధి కారకాలు మధుమేహం, రక్తపోటు, ఊబకాయం ఉన్న వారిలో కిడ్నీ వ్యాధులు రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సెకండరీ ప్రీవెన్షన్ అంటారు.
స్ర్కీనింగ్ టెస్టు చేయించుకోవాలి :
మూత్రంలో ప్రొటీన్స్ ఎంత మోతాదులో వెళ్తున్నాయి. రక్తంలో సెరమ్ క్రియేషన్స్ పరీక్షించడం, అల్ర్టా సౌండ్ తో రెండు మూత్ర పిండాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు స్ర్కీనింగ్ టెస్టు చేయించుకోవాలి.
ఎవరు స్ర్కీనింగ్ పరీక్ష చేసుకోవాలి:
40 ఏళ్ల వయస్సు వారు స్ర్కీనింగ్ పరీక్ష చేసుకోవాలి. మధుమేహం , రక్తపోటు, ఊబకాయం ఉన్న వారు , వంశ పారం పర్యంగా కిడ్నీ జబ్బులు, గుండె, బ్రెయిన్ స్ర్టోక్ వచ్చిన వాళ్లు. గుండె జబ్బులు, బ్రెయిన్ స్ర్టోక్ వచ్చిన వాళ్లు స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాలి.