NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థుల‌వి ప్రాణాలు కాదా ..?: నారా లోకేష్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన విజృంభ‌ణ దృష్ట్యా మంత్రి వ‌ర్గ స‌మావేశం వాయిదా వేసిన జ‌గ‌న్ రెడ్డి.. ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్షలు ఎందుకు వాయిదా వేయ‌డంలేద‌ని టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నించారు. సీఎం, మంత్రుల‌వి ప్రాణాలు.. విద్యార్థుల‌వి ప్రాణాలు కాదా? అని ప్రశ్నించారు. ఇంటి నుంచి స‌చివాల‌యానికి క‌ట్టుదిట్టమైన భ‌ద్రత‌, క‌రోన జాగ్రత్తలు తీసుకుని .. మంత్రి వ‌ర్గ స‌మావేశానికి వెళ్లడానికి భ‌య‌ప‌డి మంత్రి వ‌ర్గ స‌మావేశాన్ని ముఖ్యమంత్రి వాయిదా వేయించార‌ని అన్నారు. 15 ల‌క్షల మంది విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ప‌రీక్షల నిర్వాహ‌కులు.. మొత్తం 80 ల‌క్షల మంది రోడ్ల మీద‌కు రావాల్సి ఉంటుంద‌ని, వారికి క‌రోన సోక‌దా ? అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు

About Author