NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కారు బాంబు పెట్టించింది మీరు కాదా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాజీమంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు ఎమ్మెల్యే ప్ర‌కాశ్ రెడ్డి పై మండిప‌డ్డారు. శ్రీరాములయ్య సినిమా షూటింగ్‌లో కారు బాంబు పెట్టించింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 26 మందిని పొట్టన పెట్టుకోవడంలో ప్రకాష్‌రెడ్డి కూడా భాగస్తుడని తెలిపారు. తమ చరిత్ర కాదు.. ప్రకాష్‌రెడ్డి తన చరిత్ర తెలుసుకోవాలన్నారు. ప్రకాష్‌రెడ్డి అవినీతిపై సినిమా తీసేరోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. తమ కుటుంబాన్ని విమర్శించడం కాదని, ప్రాజెక్టులు పూర్తి చేసి చూపించాలని సవాల్ విసిరారు. మాజీమంత్రి పరిటాల రవి గురించి మాట్లాడితే సహించేది లేదని సునీత హెచ్చరించారు.

                                              

About Author