ఆన్లైన్లో మాత్రమే ఆర్జితసేవ మరియు స్వామివారి స్పర్శదర్శనం టికెట్లు
1 min readపల్లెవలుగు వెబ్ శ్రీశైలం: మే 1వ తేదీ నుంచి అన్ని ఆర్జితసేవలు మరియు శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం టికెట్లను భక్తులకు ఆన్లైన్ ద్వారానే జారీ చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు మే ఒకటో తేదీ నుంచి. టికెట్లు కరెంటు బుకింగ్ ద్వారా నిలుపుదల చేస్తున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ఆర్జిత సేవలు మరియు శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచేందుకు ఆలయ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శ్రీశైల క్షేత్రానికి రోజురోజుకీ భక్తులు తాకిడి పెరుగుతుంది సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా ఉండేందుకు సౌకర్యవంతంగా శ్రీ స్వామి అమ్మవారిని దర్శించేందుకు వీలుగా అన్ని ఆర్జితసేవలు మరియు శ్రీస్వామివార్ల స్పర్శదర్శనంటికెట్ల జారీ విషయములో మే 1వ తేదీ నుంచి మార్పులు చేస్తున్నారు. సామాన్య భక్తుల సర్వదర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకుగాను అన్నీ ఆర్జితసేవలు కూడా విడతలవారిగా నిర్వహించబడుతాయి. అదేవిధంగా శ్రీ స్వామివారి స్పర్శదర్శనం కూడా నిర్దిష్ట వేళల్లోనే కల్పించబడుతుంది. భక్తుల సర్వదర్శనానికి ఇబ్బందులు కలుగుకుండా ఉండేందుకుగాను అన్నీ ఆర్జితసేవలు కూడా విడతలవారిగా నిర్వహిస్తారు అదేవిధంగా శ్రీ స్వామివారి స్పర్శదర్శనం కూడా నిర్దిష్ట సమయంలోనే భక్తులకు కల్పించబడుతుంది ఆన్లైన్లో టికెట్ తీసుకున్న భక్తులు 15 నిమిషాలు ముందుగా టికెట్ల ప్రవేశ ద్వారా భక్తులు రావాలి మల్లన్న స్పర్శ దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులు వారు కేటాయించిన సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతించబడునుస్వామివారి గర్భాలయ అభిషేకం టికెట్లు 100 ఆన్లైన్లో ఉంచనున్నారు మూడు విడుదలగా అభిషేకాలు భక్తులకు జరిపించబడును మరియు సామూహిక అభిషేకం టికెట్లు రోజుకు 700 భక్తులకు అందుబాటులో ఉంటున్నారు వీరికి కూడా మూడు విడుదలుగా సామూహిక అభిషేకాలు భక్తులకు జరిపించబడునుఅమ్మవారి కుంకుమార్చన ముఖ మండపంలో రోజుకు 450 టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు వీటితోపాటు వివిధ సేవలు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. దేవస్థానం వెబ్ సైట్ www.srisailadevasthanam.org ‘ ద్వారా సేవ టికెట్లను భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.