ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
1 min read– జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కడప-అనంతపురం- కర్నూలు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సజావుగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వేచ్చాయుత వాతావరణం లో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 74 పోలింగ్ స్టేషన్లు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 27 పోలింగ్ స్టేషన్ లు, కర్నూలు లోకల్ అథారిటీస్ కు సంబంధించి ఆరు ఆర్డీవో కార్యాలయాల్లో పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు…ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించాలని, అందుకు సంబంధించిన రోజు వారీ నివేదికలను అందచేయాలని సంబంధిత నోడల్ అధికారి ని ఆదేశించారు..అలాగే అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించిన రోజు వారీ నివేదికలను రూపొందించాలని సూచించారు ..పోలింగ్ స్టేషన్లలో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు..జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల నిర్వహణకు 300 బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేయాలని డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి కి సూచించారు.. ఎన్నికల సిబ్బంది నియామకాన్ని పూర్తి చేయాలని NIC అధికారి కి సూచించారు..ఎన్నికల సిబ్బందికి శిక్షణకు సంబంధించి ఈ వారంలో మాస్టర్ trainers కు, వచ్చే వారంలో క్షేత్ర స్థాయిలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జడ్పీ సీఈఓ ను ఆదేశించారు.. ఎన్నికల శిక్షణ పర్యవేక్షణకు కొంతమంది జిల్లా అధికారులను నియమించాలని డి ఆర్వో ను ఆదేశించారు.. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కు సంబంధించి అభ్యర్థుల పేర్లలలో అక్షర దోషాలు లేకుండా ప్రింట్ చేయాలన్నారు. అలాగే బ్యాలెట్ పేపర్ మడత పడడం, సంఖ్యలు మిస్ కావడం లేకుండా చూడాలన్నారు.. బ్యాలెట్ పేపర్లను పటిష్టమైన బందోబస్తుల నడుమ సంబంధిత పోలింగ్ స్టేషన్లకు పంపాలన్నారు. బిఎల్వోల ద్వారా ఓటర్స్ స్లిప్పులను పంపిణీ చేయాలని సంబంధిత నోడల్ అధికారిని ఆదేశించారు. స్ట్రాంగ్ రూములు, రిసెప్షన్ సెంటర్ల దగ్గర పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పోలింగ్ స్టేషన్ లలో మైక్రో అబ్జర్వ ర్ల ను నియమించాలన్నారు.సమావేశంలో డి ఆర్వో నాగేశ్వరరావు, ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు.