ఆర్మీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం !
1 min read
పల్లెవెలుగువెబ్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో పాల్గొన్న జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌కు చెందిన గోవింద్ అజయ్ అనే యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్ స్టేషన్ అల్లర్లలో ఒక టీవీ ఛానల్‌లో అజయ్ మాట్లాడాడు. తన మీద పోలీసులు కేస్ నమోదు చేస్తారేమోనన్న భయంతో అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి అజయ్‌ను చికిత్స నిమిత్తం తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.