విద్యుత్ చార్జీల పెంపు పై జనసేన అధినేత పోరాటం
1 min read
పల్లెవెలుగువెబ్ : విద్యుత్ ఛార్జీల పెంపు పై జనసేన ప్రత్యక్ష పోరాటం ప్రారంభించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 1న కలెక్టరేట్ల ముందు జనసేన నిరసనలు తెలుపుతుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఛార్జీలపై ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఒక్కసారి పవర్ ఇవ్వండి.. నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ విద్యుత్ ఛార్జీలు పెంచి వైసీపీ తన పవర్ చూపించిందని ఆయన ఆరోపించారు. ఆదాయం లేదు, రాబడి లేదు.. అయినా ట్యాక్సులు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.