PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్మీ ఆఫీసరంటే ఇలా ఉండాలి.. అనేలా!

1 min read

సినిమా డెస్క్​ : అక్కినేని అందగాడు, మ్యాన్లీ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం బాలీవుడ్‌ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ లో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆమిర్‌‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో కామెడీ డ్రామా గా తెరకెక్కుతోందీ చిత్రం. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎరిక్ రోత్ మరియు అతుల్ కులకర్ణి లు స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి అమీర్ ఖాన్, కిరణ్ రావు, రాధిక చౌదరీ లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ రివీలైన ప్రచారచిత్రాలకు మంచి స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుండి తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నాగ చైతన్య పక్కా ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. తన కథల్లో డిఫరెంట్ లుక్‌ను మెయిన్‌టైన్‌ చేసే చైతూ ఈ చిత్రం కోసం పూర్తిగా ఆర్మీ ఆఫీసర్ లా మారిపోయి కనిపించడం.. టీమ్‌తో కలిసిపోయినట్టుగా ఉండే ఈ ఫోటో చూస్తుంటే ఆయన సినిమాపై ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతోంది. ఈ చిత్రం ను ఈ ఏడాది డిసెంబర్ కి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

About Author